పయనించే సూర్యుడు, మే 21 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్‌లో ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగా రెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య మైన కార్యక్రమం ఘనంగా నిర్వహించ బడింది. కార్యక్రమం ప్రారంభంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కొండాపూర్ డివిజన్ నూ తన అధ్యక్షునిగా మహమ్మద్ జాంగిర్‌ను నియమిస్తూ ఆర్డర్ కాపీ అందజేశా రు.కార్యక్రమంలో ఆఫీస్‌పేట్ ప్రాంతానికి చెందిన ముస్లిం మైనారిటీలు పెద్ద ఎత్తు న తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. వారికి రంగారెడ్డి జిల్లా అధ్య క్షుడు అడ్వకేట్ బండారి రమేష్ యాదవ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు.ఈ సందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగాని నర్సింగ్ ముదిరాజ్ మాట్లాడుతూ, ముస్లిం మైనార్టీల భారీగా పార్టీలో చేరిక పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, తీన్మార్ మల్లన్న ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. అదేవి ధంగా జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్ మాట్లాడుతూ, ప్రతి స్కూల్లో పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థులపై జరుగుతున్న ఫీజుల దోపిడిని అరికట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జావేద్ భాయ్, ఫిరోజ్ భాయ్, ఫయాజ్ భాయ్, అమర్, సమీర్, షరీఫ్, మౌసీన్, ఖదీర్, జుబేర్, అభిషేక్, నరసింహ తదితరులు తెలంగాణ రా జ్యాధికార పార్టీలో చేరారు.ఈ కార్యక్ర మంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయ
కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.