కొత్తమ్మతల్లి సన్నిదిలో నేటి నుంచి ఉచిత యోగా

జనం న్యూస్ జూన్ 7 కోటబొమ్మాళి మండలం :స్థానిక శ్రీ కొత్తమ్మతల్లి ఆలయంలో ఆదివారం నుంచి ఈనెల 21వ తేదీవరకు ప్రతీ రోజు ఉదయం 5 గంటలనుంచి 7 గంటలవరకు ఉచితంగా యోగా, మేడిటిషన్ కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ కార్యనిర్వాహాధికారి వాకచర్ల రాధాక్రిష్ణ శనివారం ఒక ప్రకటనలతో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఆలయ కమిటి చైర్మన్ కోరాడ గోవిందరావు అధ్యక్షతన ప్రముఖ యోగా గురువులచే శిక్షణ ఇవ్వటం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.