కొత్త ఇంటికి కొత్త వెలుగు.. కాంగ్రెస్ నాయకుల సమక్షంలో గృహప్రవేశం

పయనించే సూర్యుడు జులై 03, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : చింతకాని మండలం చిన్నమండవ గ్రామంలో నూతన గృహప్రవేశ మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ, కొత్త ఇంటిలో కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారిలో పర్సగాని సీతయ్య, సుంక వెంకటేశ్వర్లు, వల్లపుట్టు రమేష్, అజ్ఞాట్లు వనారం, వాస్తవ ప్రవీణ్, గ్రామ ఇంచార్జ్ కూరపాటి కిషోర్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు పర్సగాని వెంకట్రావు, టౌన్ నాయకుడు జాలపల్లి గోపాలరావు, ఉప సర్పంచ్ తంగిరాల మాధవి, వార్డు సభ్యులు కోటి, మెసయ్య, అజిత్, రామారావు తదితరులు పాల్గొని గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.