పయనిం చే సూర్యుడు.. న్యూస్..08. నేలకొండపల్లి.. ఖమ్మం పట్టణంలోని పోలీస్ కమిషనర్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన కొరట్లగూడెం గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినందుకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు ను శాలువా తో ఘనంగా సన్మానించారు. గ్రామాల్లో నాయకులు ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించడం అభినందనీయం అని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ,రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి కూసుమంచి సీఐ సంజీవ్ ,ఎస్ ఐ సంతోష్ పాల్గొన్నారు