కోటూరులో ఘనంగా మనబడి మన పండుగ

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 13.06.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// చౌడేపల్లి మండలం ఎంపీ యుపిఎస్ కోటూరు పాఠశాలలో ఈరోజు ఘనంగా మనబడి మన పండగ కార్యక్రమం జరిగింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నూతనంగా పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులను పాఠశాల పూర్వ విద్యార్థులు పూలమాలలతో సాదరంగా ఆహ్వానించి పాఠశాలను పరిచయం చేసి తమలో మమైక్యం చేసుకొనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. మన బడి మన పండుగ ఈ కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులందరికీ ఉచిత యూనిఫామ్ ఉచిత పాఠ్యపుస్తకాలను ఉచిత నోట్ బుక్స్ మాజీ సర్పంచ్ గ్రామ పెద్దలు చంద్రమౌళి విద్యార్థుల తల్లిదండ్రుల చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బత్తలాపురం మురళి విద్యార్థులకు అందజేశారు విద్యార్థులకు స్వీట్స్ పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ లు కేశవరెడ్డి తిరుమలమ్మ ఉపాధ్యాయులు బాబు రమేష్ రమణ ఆర్కే భాగ్యలక్ష్మి ఉషశ్రీ తేజస్విని శివకుమార్ షాహిన్ రమణమ్మ గ్రామ పెద్దలు తల్లిదండ్రులు పాల్గొన్నారు