కోతులను పట్టిస్తున్న తల్లాడ గ్రామ పంచాయితీ సర్పంచ్,ఉపసర్పంచ్

పట్టుకున్న కోతులు బోన్ లొ

పయనించే సూర్యుడు న్యూస్ :మే 22, తల్లాడ రిపోర్టర్ మండల కేంద్రంలోని తల్లాడ గ్రామ పంచాయితీ లో గురువారం నుంచి కోతులు పట్టాడం జరుగుతుంది. ఇటివల జరిగిన సర్పంచ్ ఎన్నికల అప్పుడు గ్రామం లో కోతులు బెడద ఎక్కువగా ఉంది అని ప్రజల నుంచి ఆరోపణలు వచ్చాయి. ఐతే సర్పంచ్ పెరిక.నాగేశ్వర రావు ఎన్నికల అప్పుడు ప్రజలకు మాట యిచ్చారు. సర్పంచ్ గా గెలిచిన తరవాత గ్రామం లో ఉన్న కోతులను పట్టిస్థాను అని హామీ ఇచ్చారు. అదే మాట ప్రకారం తల్లాడ పట్టణం లో నేటి నుంచి కోతులు పట్టే పని ప్రారంభించారు.కోతులు పట్టుకునే అందుకు మనుషులు వచ్చారు.పట్టుకున్న వాటిని మళ్ళీ చాలా దూరంగా ఆడవి ప్రాంతం లో వదిలి వస్తారు.ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, ప్రజలు, అందరూ సర్పంచ్ పెరిక.నాగేశ్వరరావు ని,ఉపసర్పంచ్ లక్ష్మరెడ్డి ని అభినందించారు.