కోరుట్లలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ ప్రార్థనలు

★ ప్రార్థనల అనంతరం ఆలయ్బలయ్లెతో శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం సోదరులు ★ ఈద్గా వద్ద భారీ బందోబస్తు నిర్వహించిన కోరుట్ల పోలీసులు

పయనించే సూర్యుడు ,( కోరుట్ల) మే 29 :- కోరుట్ల పట్టణంలో బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఈద్గా వద్ద . ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని దేశ ప్రజల శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలయ్-బలయ్లతో పలకరించుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్నారులు, యువకులు కొత్త దుస్తులతో సందడి చేస్తూ పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. ఈద్గా వద్ద భారీ బందోబస్తు నిర్వహించిన కోరుట్ల పోలీసులు పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోరుట్ల పోలీసులు ఈద్గా పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసి శాంతియుతంగా ప్రార్థనలు జరిగేలా చర్యలు చేపట్టారు.