పయనించే సూర్యుడు న్యూస్ జూలై 4 మందమర్రి మండల ప్రతినిధి బొద్దులభూమయ్య గోదావరిఖని లోని సీఎం పిఎఫ్ కార్యాలయం ఎదుట ఆందోళన ధర్నా కార్యక్రమాలు నిర్వహించిన సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం సింగరేణి వ్యాప్తంగా పదవి విరమణ చేసిన సింగరేణి విశ్రాంతి ఉద్యోగులకు ప్రతినెల రావలసిన పెన్షన్లను 1వ తారీకు రోజునే ఆయా బ్యాంకు ఖాతాల్లో విశ్రాంత ఉద్యోగుల బ్యాంకు ఖాతాలలో కోల్ మైన్స్ పెన్షన్ డబ్బులు జమ చేయవలసిన అవసరం ఉందని దన్ బాద్ లోని సీఎం పిఎఫ్ అధికారుల నిర్లక్ష్యం అలసత్వం వల్ల ఎస్ బీ ఐ బ్యాంకు లో ఖాతాలు కలిగి ఉన్న వేలాది సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు బొగ్గు పెన్షన్ దారులకు 3/7/2026 ఉదయం 10:30 గంటల వరకు కూడా పెన్షన్ వారి బ్యాంకు ఖాతాలలో జమ కాలేదనే విషయాన్ని సీఎం పిఎఫ్ అధికారుల దృష్టికి సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం తీసుకెళ్లడం జరిగిందనే విషయాన్ని విశ్రాంత ఉద్యోగులు గమనించాలని వచ్చే నెల నుండి ఒకటవ తేదీనే సింగరేణి విశ్రాంత ఉద్యోగుల వారి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని లేని యెడల సీఎం పిఎఫ్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని సీఎం పీఎఫ్ అధికారులకు తెలియజేయడం జరిగినది ఈ రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎస్ బి ఐ మెయిన్ బ్యాంక్ ఎదుట నిరసన తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య నాయకులు భూపతి లక్ష్మణ్,సంఘం రామ్ చందర్, ఇక్బాల్ హుస్సేన్, రామ్ బ్రహ్మం,రాజేశం తదితరులు పాల్గొన్నారు. సి ఎం పి ఎఫ్ అధికారుల నిర్లక్ష్యం నశించాలి. సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం వర్ధిల్లాలి. అని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగుల కార్మిక సంఘం అధ్యక్షులు గజెల్లి వెంకటయ్య సింగరేణి విశ్రాంత కార్మిక ఉద్యోగుల సంఘం సభ్యులు మంచిర్యాల జిల్లా పాల్గొన్నారు.