కోహీర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రి జహీరాబాద్ ఇన్‌చార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్

పయనించే సూర్యుడు, జూలై 7 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): తెలంగాణ రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఆర్థిక అండగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మరియు మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ సోమవారం కోహీర్ పట్టణంలోని రైతు వేదిక వద్ద ఘనంగా పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రైతు భరోసా నిధులను రికార్డు స్థాయిలో ఏకకాలంలో విడుదల చేసినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రైతు భరోసా పథకం ద్వారా వేలాది మంది రైతులకు నిజమైన ఆర్థిక భరోసా కల్పిస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. రైతుల కష్టాలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకుని వారి సమగ్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను నిబద్ధతతో అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. వ్యవసాయం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదని గ్రామీణ ప్రాంతాల్లో రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రస్తుత వానాకాలం సాగు వేళ రైతు భరోసా నిధుల విడుదలతో రైతులు తమ సాగు పనులను మరియు పెట్టుబడులను మరింత ఉత్సాహంగా ప్రారంభించేందుకు గొప్ప అవకాశం లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోహీర్ మునిసిపల్ చైర్మన్ అశోక్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సువర్ణ మల్లన్న పాటిల్, పట్టణ అధ్యక్షుడు ముజాఫ్ఫార్ హుస్సేన్, నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్, కౌన్సిలర్ శిరీష రాణి, మాజీ వైస్ ఎంపీపీ షాకిర్ అలీ, మాజీ డిప్యూటీ సర్పంచ్ మోసిన్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు అష్రాఫ్, జాలీల్, అహ్మద్, పరమేష్, సత్తార్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక రైతులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.