క్రికెట్ ఆడుతూ యువకుడు మృతి

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ మే 28 గూడూరు పట్టణంలో బుధవారం ఉదయం మేఘాలు దట్టంగా అలుముకొని ఉరుములు మెరుపులతో వర్షం పడింది. కొంతకాలంగా విపరీతమైన ఎండలకు విలవిలలాడిన ప్రజలకు ఉదయం చల్లటి గాలి వర్షంతో ఉపశమనం లభించింది. నాయుడుపేట మండలంలోని కారుమంచి వారి కండ్రిక గ్రామములో పిడుగుపాటుకు యశ్వంత్ ( 22 ) మృతి చెందాడు. గ్రామ సమీపంలోని పంట పొలాల వద్ద స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది పిడుగుపాటుతో తీవ్రంగా గాయపడిన యశ్వంత్ ను వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు ,అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.