పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మే 22 మామిడిపెల్లి లక్ష్మణ్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాయికల్ బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. బాలురకు వాలీబాల్, చెస్, షాట్‌పుట్, బాలికలకు ఖోఖో, చెస్, షాట్‌పుట్ పోటీలను నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్ మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని తెలిపారు. ఎంపీఓ సుష్మ మాట్లాడుతూ క్రీడల్లో ముందుండే విద్యార్థులు చదువులోనూ రాణిస్తారని పేర్కొన్నారు. బాలుర విభాగంలో వాలీబాల్‌లో రామాజీపేట ప్రథమ, రాయికల్ ద్వితీయ స్థానం సాధించగా, చెస్‌లో మనీష్ ప్రథమ, అఖిలేష్ ద్వితీయ స్థానాలు పొందారు. షాట్‌పుట్‌లో రమేష్ ప్రథమ, ఉదయ్ ద్వితీయ స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో ఖోఖోలో అల్లీపూర్ ప్రథమ, రాయికల్ ద్వితీయ స్థానం సాధించాయి. చెస్‌లో చైత్ర ప్రథమ, శాన్వి ద్వితీయ స్థానాలు పొందగా, షాట్‌పుట్‌లో శశిప్రియ ప్రథమ, అర్చన ద్వితీయ స్థానాలు సాధించారు. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు శ్రీధర్, రాకేష్ నాయక్, ఎస్‌జీఎఫ్ మండల కన్వీనర్ క్రిష్ణ ప్రసాద్, సీనియర్ ఉపాధ్యాయులు పొన్నం రమేష్, పీడీలు రాజగోపాల్, గంగాధర్, రమేష్,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.