ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి,

పిడిఎస్ఓ, డిమాండ్

పయనించే సూర్యుడు జూలై 05 ఆదోనిడివిజన్ ప్రతినిధి గుమ్మల బాలస్వామి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ పిడిఎస్ఓ విద్యార్థి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ,కు వినతి పత్రం అందజేస్తూ, పిడిఎస్ఓ రాష్ట్ర నాయకులు తిరుమలేష్ మాట్లాడుతూ,ప్రస్తుతం అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది కొన్ని పాఠశాలల్లో 300 మందికి పైగా విద్యార్థులు ఉన్నప్పటికీ ఒకే ఒక్క ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనివల్ల అన్ని తరగతుల విద్యార్థులకు సరైన విద్యాబోధన అందడం లేదు ఫలితంగా విద్యార్థుల చదువు దెబ్బతింటోంది ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత మౌలిక సదుపాయాల లోపాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ విద్యపై దుష్ప్రచారం జరుగుతోంది దీంతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పెరిగి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు అందువల్ల ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని పిడిఎస్ఓ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది ప్రభుత్వం ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేపడతామని పిడిఎస్ఓ విద్యార్థి సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది,ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు మళ్లీ ,గణేష్, మల్లికార్జున, రాము తదితరులు పాల్గొన్నారు