పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే.24.05.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ// సమాజంలో త్యాగం అనేది కేవలం జంతు బలికే పరిమితం కాలేదు. భగవంతునిపై భక్తితో ప్రాణాలు అర్పించడం, ధర్మం కోసం అత్యున్నత త్యాగం చేయడం, దేశం కోసం ప్రాణాలర్పించడం (దేశభక్తి) మరియు మతపరమైన ఆచారాలలో భాగంగా జంతువులను బలి ఇవ్వడం వంటి అనేక సందర్భాల్లో 'త్యాగం' అనే పదాన్ని ఉపయోగిస్తారు.
చారిత్రక నేపథ్యం:
ఈ సంప్రదాయం దాదాపు 4,500 సంవత్సరాల క్రితం ప్రవక్త ఇబ్రహీం (అబ్రహం) కాలం నాటిది. భగవంతునిపై తనకున్న అనన్య సామాన్యమైన భక్తిని నిరూపించుకోవడానికి ఇబ్రహీం తన అత్యంత ప్రియమైన కుమారుడు ఇస్మాయిల్‌ను త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. ఆయన నిష్కల్మ0ష భక్తికి మెచ్చిన అల్లాహ్, కుమారుడి స్థానంలో ఒక గొర్రెను ప్రసాదించి దానిని బలిగా స్వీకరించారు.
ఆధ్యాత్మిక సందేశం:
ప్రాపంచిక వస్తువులపై, బంధాలపై ఉన్న మోహాన్ని వీడి, హృదయాన్ని భగవంతుని ప్రేమామృతంతో నింపడమే ఈ పండుగ యొక్క అసలు ఉద్దేశం. ఖురాన్ (సూరా అల్-హజ్ 22:37) ప్రకారం—భగవంతునికి చేరేది జంతువుల మాంసం లేదా రక్తం కాదు, కేవలం మనుషుల యొక్క "భక్తి, పవిత్రత (తఖ్వా)" మాత్రమే. జంతు బలి మరియు సామాజిక స్పృహ
అనుమతించబడిన జంతువులు:
ఇస్లాంలో ఒంటె, మేక, గొర్రె, ఎద్దు, ఆవు, గేదె వంటి శాకాహార జంతువుల ఖుర్బానీకి అనుమతి ఉంది. అయితే వాతావరణం, లభ్యతను బట్టి ఇవి మారుతుంటాయి. ఉదాహరణకు, అమెరికాలో ఒంటెలు దొరకవు కాబట్టి అక్కడ లభించే జంతువులను సమర్పిస్తారు.
హిందూ సంప్రదాయాల పట్ల గౌరవం:
భారతదేశంలో ఆవును 'గోమాత'గా పూజిస్తారు. కాబట్టి, మన హిందూ సహోదరుల మతపరమైన, సాంప్రదాయక విలువలను గౌరవిస్తూ ఆవుల వధకు దూరంగా ఉండాలి. భారతదేశంలో మేకలు, గొర్రెలు, గేదెలు పుష్కలంగా లభిస్తాయి కాబట్టి, ఒక మేక లేదా గొర్రెతోనే ఖుర్బానీ పూర్తి చేయవచ్చు.
బీఫ్ (మాంసం) వినియోగంపై అవగాహన:
బీఫ్ అంటే కేవలం ఆవు మాంసం మాత్రమే కాదు; ఎద్దు, గేదె మాంసం కూడా అందులోకి వస్తాయి. భారతదేశంలో బీఫ్ అనేది ఒక చౌకైన ప్రొటీన్ వనరు కావడం వల్ల కేవలం ముస్లింలే కాకుండా, ఆర్థికంగా వెనుకబడిన వివిధ మతాలకు చెందిన ప్రజలు, సైనిక క్యాంపులలోని వారు కూడా దీనిని తింటారు. అలాగే, భారతదేశంలోని ప్రధాన బీఫ్ కంపెనీలు ముస్లిమేతరుల యాజమాన్యంలోనే ఉన్నాయి.
ప్రస్తుత పరిస్థితులు - ఆడంబరాలు
ప్రస్తుత కాలంలో ఖుర్బానీ యొక్క అసలు ఉద్దేశం పక్కకు పోయి, అది కేవలం విందు వినోదాల పండుగగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మేకల మార్కెట్లలో జంతువులకు సినిమా స్టార్ల పేర్లు పెట్టడం, వాటిని ఆడంబరంగా అలంకరించి ప్రదర్శించడం వంటివి అజ్ఞానానికి, వినోదానికి నిదర్శనాలని, ఇది ఖుర్బానీ యొక్క పవిత్రతను దెబ్బతీస్తోందని ఆయన పేర్కొన్నారు. వివిధ మతాలలో 'ఆవు' ప్రస్తావన
అబ్రహామిక్ మతాలు (మోసెస్ చరిత్ర):
పూర్వ కాలంలో ప్రజలు బంగారు దూడను దైవంగా భావించి పూజించే మూఢనమ్మకంలో ఉన్నప్పుడు, ప్రవక్త మోసెస్ (మూసా) ఆ జంతువులు దైవం కావని నిరూపించడానికి వాటిని వధించి ప్రజలకు విందు ఇచ్చారు. హిందూ మతం - వేదాల అంతరార్థం: వేదాలలో 'గో' లేదా 'గౌ' అనే పదానికి 'ఆవు' అనే అర్థం కంటే "కాంతి" (లైట్) అనే విస్తృత అర్థం ఉంది. ఉదాహరణకు, 'గోవర్ధన్' అంటే కాంతికి అధిపతి అని, 'గోవింద' అంటే కాంతిని ఇచ్చే భగవంతుడని అర్థం. స్వామి వివేకానంద గారి ప్రకారం, ఆధ్యాత్మిక అవగాహన లేని వారే 'గో' అనే పదాన్ని కేవలం జంతువుగా పొరబడుతుంటారు. 'గో' అంటే అంతర్గత చేతనా శక్తి లేదా ఆత్మ అని కూడా అఅర్థ త్యాగం అనేది జంతువులకో, ధనానికో సంబంధించింది కాదు; అది మనిషి అంతరంగ సమర్పణ. మనలోని అహంకారాన్ని, స్వార్థాన్ని, పేదల పట్ల ఉన్న ఉదాసీనతను వదిలిపెట్టనంత కాలం, మనం కేవలం ఒక జంతువును చంపిన వాళ్లమవుతామే తప్ప మన అహాన్ని చంపుకున్నట్టు కాదు. లభించే దాన్ని కాకుండా, మనకు అత్యంత ప్రియమైన దాన్ని త్యాగం చేయడం నేర్చుకోవాలి.