పయనించే సూర్యుడు జూన్ 16 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలంలోని తూరూపుపల్లి అనే గ్రామంలో వ్యవసాయ పరిశోధనా స్థానం పొదలకూరు వారి ఆధ్వర్యంలో మరియు వ్యవసాయ శాఖ సహకారంతో ఖేత్ బచావో అభయాన్ నేల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం భవిష్యత్తును సంరక్షించుకుందాం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు . వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొనడం జరిగినది. పొదలకూరు వ్యవసాయ పరిశోధనా స్థానం, శాస్త్రవేత్త డా. వి.సురేఖా దేవి మాట్లాడుతూ ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వావిద్యాలయం వారు ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించాలని సంకల్పించింది అని తెలియజేశారు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మట్టి నమూనా పరీక్ష యొక్క ప్రాముఖ్యత మరియు మట్టి పరీక్ష ఆధారిత ఎరువులు, పచ్చి రొట్టె ఎరువులు మరియు జీవన ఎరువుల ప్రాముఖ్యత మరియు వివిధ పంటలలో వాటి ఉపయోగం గురించి కూడా తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమం లో శాస్త్రవేత్త ఎస్ కె హసీనా, మాట్లాడుతూ సమగ్ర పోషక యాజమాన్యం గురించి, నేలను సారవంతం చేయడం లో వివిధ పోషకాలు ఆవశ్యకత ను వివరించారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారి హిమ బిందు . ఏ పి ఏ ఐ ఎమ్ ఎస్ 2.0 అప్ లో నే యూరియా తీసుకోవాల్సి ఉంటుంది. శాస్త్రవేత్త ల సలహాల మేరకు పచ్చి రొట్ట ఎరువులు విత్తనాలు అందుబాటులో వున్నాయి అని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమం లో వి. ఏ. ఏ సుజాత రైతులు పాల్గొన్నారు.