గిరిజన యువతికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం… గిరిజన సమైక్య నాయకులు

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 13 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున గిరిజన యువతినీ అత్యాచారం హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం తో పాటు 50 లక్షల రూపాయల ఎక్స్ప్లేషియా ప్రకటించాలని సిపిఐ గిరిజన సమైక్య ప్రధాన కార్యదర్శి వై ఎల్ రామాంజనేయులు డిమాండ్ చేశారు సిపిఐ రాజకీయ శిబిరాలలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు లో జరుగుతున్న కార్యక్రమంలో గిరిజన నాయకులతో కలిసి పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతతకు మారుపేరైన పాలకొండలో గిరిజన యువతి అత్యాచారానికి గురై హత్య గావించబడటం దురదృష్టకర సంఘటనగా ఆయన అభివర్ణించారు గిరిజన యువతిని అత్యంత దారుణంగా కాళ్లు చేతులు కట్టివేసి హత్య చేసి పాలకొండ మండలం తుమరాడ వయా చింతాడ పరిధిలో చెరువులో పడి వేయటం అత్యంత హేయమైన దుర్ఘటనని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు నిర్వహించి హత్య గావించబడిన గిరిజన యువతి కుటుంబానికి న్యాయం జరిగేలాగా ప్రభుత్వ ఉద్యోగం తో పాటు 50 లక్షల రూపాయల పారితోషకం అందించి