గుంజ వెంకట గురువులు &సజ్జ సుజాతమ్మ కు నివాళులర్పించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం మే 23 జగ్గయ్యపేట మండలం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన గుంజ వెంకట గురువులు ఆకస్మిక మరణాన్ని చింతిస్తూ వారి నివాసానికి వెళ్లి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు జగ్గయ్యపేట మండలం గరికపాడు గ్రామానికి చెందిన సజ్జ సుజాతమ్మ మరణించిన విషయాన్ని తెలుసుకొని ఈరోజు వారి స్వగృహానికి వెళ్లి భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు వారితోపాటు గ్రామ పార్టీ అధ్యక్షులు మూడు స్వామి, జిల్లా యువజన విభాగ ఉపాధ్యక్షులు బజార్ సాయి, నియోజకవర్గ ప్రచార విభాగ అధ్యక్షులు బైరబోయిన బాబు, మండల కార్యవర్గ సభ్యులు పిట్టల సత్యనారాయణ, ఇనపనుర్తి శ్రీనివాసరావు, ఆదిమాళ్ళ ముత్యాలు, వట్టికూటి మట్టపల్లి తదితరులు నివాళులర్పించారు