పయనించే సూర్యుడు జూలూరుపాడు రిపోర్టర్ గడిదేశి ప్రేమ్ జూలై 8/26 వర్షాకాలంలో పశువులు వ్యాదుల బారిన పడకుండా ఉండాలని పశుసంపద అభివృద్ధి చెందాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని గ్రామం సుబిక్షంగా ఉండాలని సీతలా భవానిని వేడుకుంటారు ఈ పండుగ రోజున గిరిజనులు ధాన్యపు గింజలతో వెళ్లి గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పిస్తారు గ్రామంలోని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేస్తారు పూజ కార్యక్రమం అనంతరం బంజారా మహిళలలు పురుషులు తమ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆట పాటలతో ఆనందోత్సాహాల నడుమ ఈ పండుగను జరుపుకుంటారు అని గుండెపుడి గ్రామ సర్పంచ్ భూక్య అరుణ ఉప సర్పంచ్ బాదావత్ నరేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో గుండెపూడి మాజీ సర్పంచ్ బాబు నరసింహారావు సత్యం సుమన్ విక్రమ్ రమేష్ వెంకన్న తదితర గ్రామస్తులు పాల్గొన్నారు