గుంతలు తవ్వి గాలికి వదిలేసిన గ్రామపంచాయతీ..! సిబ్బందిప్రజల ప్రాణాలతో చెలగాటమా..?

గ్రామపంచాయతీ నిర్లక్ష్యం.. ప్రజలకు ప్రాణహాని..! వారం రోజులుగా గుంతలు అలాగే.. సగం పూడ్చి సగం వదిలేసిన సిబ్బంది

జనం న్యూస్ 07 జూన్ 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్: గ్రామపంచాయతీ నిర్లక్ష్యం.. ప్రజలకు ప్రాణహాని..! వారం రోజులుగా గుంతలు అలాగే.. సగం పూడ్చి సగం వదిలేసిన సిబ్బంది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని మేడిపల్లి – నక్కర్త గ్రామపంచాయతీ పరిధిలో గ్రామపంచాయతీ సిబ్బంది తవ్విన గుంతలను సక్రమంగా పూడ్చకుండా నిర్లక్ష్యంగా వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి పక్కనే తవ్విన ఈ గుంతలను వారం రోజులుగా అలాగే వదిలేయడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది గుంతలు తవ్వి సగం మాత్రమే పూడ్చి మిగతా భాగాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడం వెనుక కారణమేంటని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లు, గ్రామ సెక్రటరీ ప్రజా సమస్యలపై స్పందించకుండా నిద్రమత్తులో ఉన్నారంటూ మండిపడుతున్నారు. ప్రధాన రహదారి పక్కనే గుంతలు ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే గుంతలను పూర్తిగా పూడ్చి రహదారిని సరిచేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే గ్రామస్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.