గుడ్లనర్వ గ్రామంలో రూ. 3 లక్షలతో అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభం

పనులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ లేట్ల బాలస్వామి ఉప సర్పంచ్ దాసరి శివ

పయనించే సూర్యుడు మే 29 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా ​బిజినపల్లి, మండల పరిధిలోని గుడ్లనర్వ గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలోని 11వ వార్డులో నూతనంగా నిర్మించ తలపెట్టిన అండర్ డ్రైనేజీ (భూగర్భ మురుగునీటి కాల్వ) పనులను గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ పనులను దాదాపు 3 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టడం జరుగుతోందని స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపారు. ​ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లేట్ల బాలస్వామి, ఉపసర్పంచ్ దాసరి శివుడు పాల్గొని పనులను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు, పారిశుద్ధ్య మెరుగుదలకు తమ పాలకవర్గం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. 11వ వార్డులో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రాధాన్యత క్రమంలో ఈ పనులను చేపట్టినట్లు వివరించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, గడువులోగా పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక 5వార్డు మెంబర్, భీమని రాజు 11 వ వార్డు మెంబర్ శంకర్ మరియు వార్డ్ మెంబర్లు గ్రామ ప్రముఖులు, ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.