గూడూరులో కూలీ రేట్లు పెంచాలి

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్.

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ మే 24 గూడూరు కూరగాయల మార్కెట్ లో మోట వర్కర్స్ కూలి రేట్లను పెంచాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సిహెచ్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. శనివారం. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ముఠా కార్మికులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, నిత్యవసర దారలు పెరిగిన ,12 ఏళ్లుగా కూలీ రేట్లు పెంచ లేదన్నారు. చాలీచాలని కూలితో ముఠా కార్మికులు జీవనం దుర్భరంగా ఉందన్నారు. వెంటనే కూలి రేట్లు పెంచాలన్నారు. ఈ సమావేశం లో సిపిఐ నాయకులు ముఠా కార్మికులు పాల్గొన్నారు.