గూడూరులో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూలై 9 గూడురూ రెండో పట్టణం గాంధీనగర్ లోని క్రిస్టియన్ స్మశాన వాటిక పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనపై సకాలంలో స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విద్యుత్ శాఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.