గూడూరు లోని గాంధీనగర్ లో భూకబ్జాలు

పట్టించుకోని అధికారులు

పయనించే సూర్యుడు గూడూరున్యూస్ మే నెల్లూరు జిల్లా గూడూరు రెండో పట్నం గాంధీనగర్ లోని నాయి బ్రాహ్మణ కాలనీ ఆరో వీధిలో భూకబ్జాలు అధికమయ్యాయి. ఎటువంటి ఇంటి పట్టాలు లేకపోయినా రెవెన్యూ మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోయినా ఏ. హరి తండ్రి భాస్కర్ అనే వాళ్ళు. ఇతరుల వద్ద కొన్నామని చెప్పుకుంటూ ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా మండల తాసిల్దార్ నుంచి అనుమతి తీసుకోకుండా వీఆర్వో విజయ్ కుమార్, గాంధీనగర్ కి చెందిన కొందరు రాజకీయ నాయకుల సహకారాలతో ప్రభుత్వము ఇతరులకు ఇచ్చిన ఇంటి పట్టా స్థలాలు కబ్జా చేస్తున్నకూడ గూడూరు రెవెన్యూ శాఖ నిమ్మకు నీరెత్తినట్టు గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సెలవు దినాల్లో కబ్జాలు అధికంగా గాందీనగరులో జరుగుతున్నాయి. ఈ నాయి బ్రాహ్మణ కాలనీలో బోగస్ పట్టాలు ఉన్నాయని ఇతరులకు విక్రయించి ఉన్నారని జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసి ఉన్న కూడా, ఎటువంటి నిర్మాణాలు జరపవద్దని తెలియజేసిన కూడా, ఇక్కడ ఆక్రమణలు జోరు రోజురోజుకు పెరుగుతున్నాయి. యధా రాజా తదా ప్రజా గా ఉంది .జిల్లా కలెక్టర్ స్పందించి ఈ నాయి బ్రాహ్మణ కుల సంఘంల వారికి మంజూరు చేసిన ఇళ్ల స్థలాల అవక తవకలపై సమగ్రమైన విచారణ జరిపించవలసిందిగా ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు ఎల్.వి సుబ్బయ్య, గాంధీనగర్ ప్రజలు కోరుతున్నారు .