పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ మే 28 తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, తెలుగుదేశం పార్టీ పండుగ 'మహానాడు' వేడుకలు గూడూరు నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరిగాయి. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని క్లస్టర్ల పరిధిలో వర్చువల్ విధానంలో 45వ మహానాడు కార్యక్రమాన్ని ఘనం గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుదిశలా చాటిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావు గారిదైతే, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి జాతీయ స్థాయిలో తెలుగు జాతి గొప్పదనాన్ని నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దని కొనియాడారు. భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో యువతకు, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మహానాడు సమావేశంలో ప్రస్తావించిన ముఖ్య అంశాలు:
ఆర్థిక క్రమశిక్షణ - వర్చువల్ మహానాడు: కార్యకర్తలకు, నాయకులకు డీజిల్, పెట్రోల్ మరియు ప్రయాణ ఖర్చులు తగ్గించాలనే సదుద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్లలో వర్చువల్ పద్ధతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహానాడును నిర్వహించడం ఆయన ముందుచూపుకు నిదర్శనం అన్నారు. మహిళా సాధికారత: గతంలో మహిళల కోసం 'పసుపు కుంకుమ', 'చంద్రన్న పెళ్లి కానుక', 'దీపం పథకం' వంటివి అమలు చేసిన ఘనత టీడీపీదే. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం, ఆస్తిలో సమాన హక్కు, చట్టసభల్లో 33% రిజర్వేషన్, డ్వాక్రా సంఘాల బలోపేతం వంటి చర్యలతో మహిళలకు పెద్దపీట వేస్తోంది.
విద్య మరియు ఆర్థిక భరోసా:
ప్రతి కుటుంబం చదువుకోవాలనే లక్ష్యంతో, పిల్లల చదువుల కోసం ఒక్కొక్కరికి ₹15,000 చొప్పున అందిస్తూ, ఒకే కుటుంబంలో నలుగురు పిల్లలు ఉంటే ₹60,000 వరకు ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం .
పేదరిక నిర్మూలన:
ఏపీని "పేదరికం లేని రాష్ట్రంగా" తీర్చిదిద్దడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ ప్రతి అడుగు ప్రజల కోసమేనని, సంక్షేమం మరియు అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ స్పష్టం చేశారు ఈ మహానాడు వేదికగా పార్టీని మరింత క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు పలు తీర్మానాలు ఆమోదించారు. గూడూరు పట్టణంలోని కూడలిలో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేశారు.