పయనించే సూర్యుడు జూలై 8 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని తూర్పు ఎస్సీ కాలనీలో శ్రీ కోదండ రామస్వామి ఆలయ నిర్మాణానికి హద్దులు ఏర్పాటు చేయడం జరిగినది. రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేపట్టిన దేవాలయాల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా తాళ్లూరి గిరినాయుడు సూచనల మేరకు స్థానిక గొల్లపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు 24 ఎల్ సోమశిల కాలువ అధ్యక్షులు ఉడత హాజరత్తయ్య కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా కాలనీవాసులు ఎన్నో సంవత్సరాలు నుండి ఆలయ నిర్మాణానికి ఆశలు పెట్టుకుని సందర్భంగా వారి ఆశలు నెరవేరుస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు గ్రామ ప్రజలు తెలిపారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉడత. హాజరత్తయ్య మాట్లాడుతూ. తూర్పు ఎస్సీ కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధిలో ముందడుగు ఆపదలో వెనుకాడని ధైర్యశాలిగా కాలనీవాసుల కు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు