గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతులు

పయనించే సూర్యుడు న్యూస్, జూన్ 02 (ఏలేశ్వరం మండలం రిపోర్టర్ ఏ శివాజీ) : పట్టణంలోని శాఖా గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన వినోద తరగతులకు ముఖ్య అతిథిగా సోమవారం ఉపాధ్యాయులు మామిడి రాము విచ్చేశారు.ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ విద్యార్థులు గురువుల యందు భక్తిని అలవర్చుకోవాలని అన్నారు. అనంతరం పిల్లల మేదస్సును పెంచే ఆటలను, చిత్రలేఖనం తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తృతీయ శ్రేణి గ్రంథాలయ పాలకుడు కవికొండల సత్యనారాయణ, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.