గ్రామాల్లో ‘ప్రజాపాలన’ జాతర!

జనం న్యూస్ జూన్ 7 మండలం పెన్ పహడ్ : మండలంలోని వివిధ గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక - 99 రోజుల కార్యాచరణ' ప్రత్యేక గ్రామసభలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సమస్యల పరిష్కారం, పారదర్శక పరిపాలన, గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక అధికారుల (స్పెషల్ ఆఫీసర్స్) ప్రత్యక్ష పర్యవేక్షణలో సాగిన ఈ సభలకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. జల్మల్ కుంట తండాలో సర్పంచ్ భూక్య జమ నాయక్, గూడెపుకుంటా తండాలో సర్పంచ్ గుగులోత్ లచ్చిరాం, ధర్మపురం గ్రామంలో సర్పంచ్ దొంగరి దివ్య లింగస్వామి, దుబ్బ తండాలో సర్పంచ్ జేత్య నాయక్, గాజుల మల్కాపురం గ్రామంలో సర్పంచ్ నాతాల వెంకటరెడ్డి, దోస పహాడ్ గ్రామంలో సర్పంచ్ వలపట్ల సైదమ్మ లింగయ్య, ధూపహాడ్ గ్రామంలో సర్పంచ్ నన్నే పంగు కమలమ్మల అధ్యక్షతన ఈ గ్రామసభలు ఘనంగా జరిగాయి. ఈ సభలలో భాగంగా గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, మురుగు కాలువల పూడికతీత, హరితహారం తాగునీటి క్లోరినేషన్ వంటి మౌలిక వసతుల మెరుగుదలపై అధికారులు ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలలో ఎంపీడీవో ఏ జానయ్య, తహసిల్దార్ గుమ్మి రాజశేఖర్ రెడ్డి, ఎంఈఓ నకిరేకంటి రవి, ఎంపీఓ బీస్ రాజేశ్వర్, పశువైద్యాధికారి వెంకన్న, అధికారి జాన్ ఫ్రీడ్ క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకు వచ్చి నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు అందించడం, ఉపాధి హామీ పథకం కింద 'జల సంరక్షణ - మన సంరక్షణ' పనుల పురోగతిపై ప్రజల నుండి వినతులు, అర్జీలను స్వీకరించారు. ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో ఏపీవో రవి, ఏపీఎం అంజయ్యలతో, సిఈఓ మహేష్,పాటు పంచాయతీ కార్యదర్శులు సతీష్, రజిని, లావణ్య, జానీ వర్మ, భరత్ వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగస్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.