గ్రామీణ ప్రాంతాలకు లయన్స్ వలు విస్తరించాలి.. డాక్టర్ బాదం…

పయనించే సూర్యుడు జూలై 3, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) సేవే పరమార్ధంగా ఆవిర్భవించిన లయన్స్ క్లబ్ సేవలను గ్రామస్థాయికి మరింత విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందని లయన్స్ మాజీ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక రమణయ్యపేట లయన్స్ క్లబ్ మల్టీ సర్వీసెస్ సెంటర్లో లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని గుర్తించి ఆదుకోవడం లయన్స్ లక్ష్యమని అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఏవై శ్రీనివాస్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ చేస్తున్న సేవలకు అవసరమైతే తమ ప్రభుత్వ శాఖ ద్వారా సేవలను సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. నూతన అధ్యక్షులు సిహెచ్ నాగేంద్ర గాంధీ, కార్యదర్శి కొప్పర్తి సాయికృష్ణ, కోశాధికారి వడ్డాది నాగిని తదితర సభ్యులచే బాదం బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పేదలకు బియ్యం, నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షులు ప్రసాద్ నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లయన్స్ ప్రాంతీయ మాజీ చైర్మన్ ప్రభుదాస్, వడ్డాది మూర్తి, ఇంద్రగంటి శ్రీనివాస్, అడబాల రత్న ప్రసాద్, గరికిపర్తి ఓం నమశ్శివాయ. బుద్ధరాజు సత్యనారాయణ రాజు, వి. మురార్జీ, చేబ్రోలు గణేష్ ,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.