గ్రామీణ వైద్యుడు కృష్ణ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

పయనించే సూర్యడు మే 28 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు .నడిగూడెం మండల కేంద్రానికి చెందిన గ్రామీణ వైద్యుడు కందాల కృష్ణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందటంతో వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు నడిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మృతుని కుటుంబ సభ్యులకు 25 వేల రూపాయల నగదును మంగళవారం అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దున్నా శ్రీనివాస్,ఉప సర్పంచ్ ఎలుగూరి నాగరాజు,వార్డు సభ్యులు దున్నా శ్రీకాంత్, బాణాల సతీష్ కుమార్,గుండు మహేందర్ ప్రసాద్, కాసాని మాదవి గోపీనాథ్,షేక్ నాజియా రియాజ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు శ్రీనివాస్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బోళ్ల నర్సిరెడ్డి,వీరాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ పందిరి వెంకటరెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి వెంకటరెడ్డి, కాసాని వెంకన్న,ఎలక రామిరెడ్డి,బీరవెల్లి సురేందర్ రెడ్డి, తోట శ్రీనివాస్, కత్తి విజయ్, దేవరంగుల నాగభూషణం, షేక్ మౌలానా, శ్రీరాముల శ్రీనివాస్,ఎద్దు రమేష్, బీరవల్లి సుధాకర్ రెడ్డి,మండవ నర్సయ్య, పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.