ఘట్కేసర్ సర్కిల్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ

పయనించే సూర్యుడు) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంఎంసీ కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ కార్యాలయం వద్ద డిప్యూటీ కమిషనర్ వాణి రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది చేసిన త్యాగాలను నాయకులు గుర్తు చేసుకున్నారు. అమరవీరులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస రెడ్డి, యువ నాయకులు కౌకుంట్ల జీవన్ రెడ్డి, వంగేటి పర్వత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కిరణ్ జ్యోతి ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాగారం డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లాల కుమార్, మాజీ యూత్ అధ్యక్షుడు ఓం ప్రకాష్ గౌడ్, కార్పొరేషన్ సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.