ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

పయనించే సూర్యడు / మే 29 / ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను ఏ.ఎస్. రావు నగర్ డివిజన్ పరిధిలోని రాధిక చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జి.ఏ. చౌదరి నేతృత్వం వహించగా, మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలుగు చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలు, ముఖ్యమంత్రిగా సామాన్యుడి కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ కన్వినర్ పాతకోటి రామలింగం, బిసి సెల్ నాయకులు సందీప్ గౌడ్, మాజీ కౌన్సిలర్ ముప్పు రామారావు, ఆర్. వంశి, నవీన్ చౌదరి, పి.ఎస్. రెడ్డి, వెంకన్న, గౌతమ్ రెడ్డి, జస్వంత్ చౌదరి, పవన్ కుమార్, సాయి నిఖిల్, ఉమేష్, వెంకటేశ్వరరావు (టైలర్) తదితరులు పాల్గొన్నారు.