పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మే 31 మెట్ పల్లిపట్టణం లో శనివారం రోజు నా టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయి పంపిణీ చేసుకున్న కాంగ్రెస్ నాయకులు.. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, ఐటీ రంగ విస్తరణలో మంత్రి చేస్తున్న కృషిని కొనియాడారు. అలాగే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ రాష్ట్ర ప్రగతికి ఆయన నాయకత్వం దోహదపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్,ఏ ఏం సి డైరెక్టర్ సంగు గంగాధర్, మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్భుదిన్ పాషా,జిల్లా యూత్ కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ కూన రాకేష్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ అమ్ముల పవన్, తిమ్మాపూర్ మాజీ ఉప సర్పంచ్ సల్ల సునీల్,రెండ్ల వెంకటేష్, కూన సాయితేజ,ముద్దం ప్రశాంత్,మజ్జు,సమీర్ సర్కార్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.