ఘనంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి​• రత్నవరంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీపీఎం నాయకులు, కార్మికులు

పయనించే సూర్యడు మే 20 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి వేడుకలు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి విప్లవాంజలి ఘటించారు. ​ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, శాఖ కార్యదర్శి కన్నెబోయిన సైదయ్యలు మాట్లాడుతూ… సుందరయ్య గారు తన జీవితాంతం పేదలు, కార్మికులు, కర్షకుల సంక్షేమం కోసమే శ్రమించారని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమన్నారు. కోట్లాది రూపాయల ఆస్తిని ప్రజాసేవకే అంకితం చేసి, చివరి శ్వాస వరకు నిరాడంబర జీవితాన్ని గడిపిన మహోన్నత వ్యక్తి సుందరయ్య అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ​ఈ నివాళులర్పించిన వారిలో గ్రామీణ అమాలీలు, ట్రాక్టర్ డ్రైవర్లు, గ్రామ పంచాయతీ వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే స్థానిక వార్డు మెంబర్లు మరియు ప్రజా ప్రతినిధులు, సీపీఎం నాయకులు కూరాకుల వెంకటేశ్వర్లు, దున్న మిన్నయ్య, కనకం శ్రీను, పప్పుల తిరపయ్య, మొలుగురు నాగరాజు, మొలుగురు ఉపేందర్, చల్ల వెంకన్న, కలకొండ సాల్మన్, రాజుల వెంకట్ రాములు, బత్తుల సత్యనారాయణ, సీమట సతీష్, ఉపేందర్, యోహాన్, వెంకన్న, కుంచం ముత్తయ్య తదితరులు పాల్గొని సుందరయ్య కి ఘన నివాళులర్పించారు.