ఘనంగా చౌడాలమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపన

(ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న కేతిరెడ్డి స్వప్న నవీన్ రెడ్డి, -శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం )

పయనించే సూర్యుడు న్యూస్ :మే /20: నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలోని శ్రీ చౌడాలమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని శ్రీకృష్ణ యాదవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేతిరెడ్డి నవీన్ రెడ్డి, పాల్గొని అమ్మవారి ఆశీర్వచనం పొందారు. ఆలయ నిర్మాణంలో భాగంగా రూపాయలు 84.వేల విలువగల గ్రానైట్ మార్బుల్స్ నవీన్ రెడ్డి, శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు కేతిరెడ్డి స్వప్న నవీన్ రెడ్డి,ని శాలువాతో సత్కరించి సన్మానించారు. చౌడాలమ్మ దయతో పంట పొలాల సుభిక్షంగా పండాలని, రైతులు, ప్రజలందరూ, సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరినట్టు నవీన్ రెడ్డి తెలిపారు.