ఘనంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డా. కోట రాంబాబు వారి జన్మదిన వేడుకలు.

జనం న్యూస్ మధిర జూన్ 7, దోర్నాల కృష్ణ మధిరలోని స్థానిక కెవిఆర్ హాస్పిటల్ నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రముఖ వైద్యులు డా.కోట రాంబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో నియోజవకవర్గ వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై వారికి స్వీట్ లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకుంటూ భవిష్యత్తులో రాజకీయంగా అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరారు..