ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ జన్మదిన వేడుకలు

పయనించే సూర్యుడు, మే 22 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోని హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై గల బస్టాండ్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున బాణాసంచాలు కాల్చి కేక్ కట్ చేసి తినిపించి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో అలుపెరుగని యోధుడిగా బిఆర్ఎస్ హాయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి గా నిలిచిన మహనీయుడు గోలి శ్రీనివాస్ రెడ్డి అని కొనియాడారు. అన్న అంటే పలికే నాయకుడు ఏ సందర్భంలోనైనా అన్నా అంటే నేనున్నా అనే వ్యక్తి గోలి శ్రీనివాసరెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వివిధ గ్రామాలకు సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఉపసర్పంచ్ లు, వివిధ గ్రామాలకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారీ ఎత్తున పాల్గొన్నారు.