ఘనంగా నట విశ్వరూపం నటసార్వభౌముడు ఎస్వీ రంగారావు 108 జయంతి..

పయనించే సూర్యుడు జూలై 4, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) పౌరాణిక, సాంఘిక పాత్రలలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి తెలుగు ప్రేక్షకుల విశ్వవిఖ్యాత నట చక్రవర్తిగా చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత నటుడు ఎస్వీ రంగారావు అని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, కౌడ చైర్మన్ తలాటం సత్య పేర్కొన్నారు. . ఆంధ్ర కాపు సద్వావన సంఘం కాకినాడ ఆధ్వర్యంలో ఎస్వీ రంగారావు 108 వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.ఏ పాత్రలోనైనా అమోఘమైన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించి 300 పైగా చిత్రాలలో నటించిన ఘనత ఎస్వీ రంగారావుదన్నారు. బసవ ప్రభాకర్, ఆకుల వెంకటరమణ మాట్లాడుతూ తన అపూర్వమైన నటనతో తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన నటుడు ఎస్వీ రంగారావు అని పేర్కొన్నారు, అతి నిరుపేద కుటుంబంలో జన్మించిన ఎస్వీ రంగారావు అనేక ప్రతినాయక పాత్రలకు జీవం పోశారని , ఆయనకు భారతరత్నం ఇవ్వాలంటే డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో దొడ్డిపట్లఅప్పారావు ,మూర్తి, ముమ్మిడి సత్యనారాయణ, రామచంద్రారావు తదితరులు పాల్గొన్నారు