ఘనంగా నిర్వహించిన బడిబాట కార్యక్రమం

పయనించే సూర్యుడు, కోరుట్ల జూన్ 4. కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో స్థానిక ప్రాథమిక,ఉన్నత పాఠశా లల ఆధ్వర్యంలో బుధవారం రోజున బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గ్రామస్థులకు ప్రభుత్వ పాఠశాలల విశిష్ఠత గూర్చి వివరించారు. శిక్షణ పొందిన అనుభవజ్ఞులయిన ఉపాధ్యాయులు చక్కగా బోధిస్తారన్నారు.ఉచితంగా నోట్ బుక్కులు, యూనిఫారం, మధ్యాహ్న భోజనం పాఠశాలలో అందిస్తారని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాథ్యాయులు లోకిని శ్రీనివాస్,వసంత,గ్రామ సర్పంచ్ ముదాం రవీందర్, ఉప సర్పంచ్ చి ట్కూరి మల్లయ్య,వనతడుపుల రవి కుమార్,శేఖర్ రావు, గాంధారి శ్రీనివాస్,ముంజ వెంకటేష్, వంశీ ఉపాధ్యాయులు, విద్యార్థులు అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.