ఘనంగా పెద్దమ్మ ఆలయ ప్రతిష్టాపన

పయనించే సూర్యుడు జులై 5 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) మెదక్ జిల్లా పెద్ద శంకరం పేట మండలం విరోజిపల్లి గ్రామంలో ఏకాహినిక పెద్దమ్మ తల్లి శిఖర ధ్వజ స్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం గ్రామ ముదిరాజ్ సంఘ పెద్దల సహకారం తో శాస్త్రోక్తంగా నిర్వహించారు గణపతి పూజ పుణ్యవాచనం వాస్తు నవగ్రహ పూజ యోగిని క్షేత్ర పాలక ఇత్యాది పూజలు నిర్వహించి ప్రతిష్టాపన మూర్తులను జల దాన్యధివాసములు హోమం ద్రూక్ బలి నేత్రోన్మిలం పూర్ణాహుతి కార్యక్రమాలు అత్యంత ఉల్లాసంగా పండగ వాతావరణం లో నిర్వహించడం అయ్యింది ఈ కార్యక్రమంలో స్థానిక పూర్హోతులు గుడి చంద్రశేఖర్ వైదిక నిర్వహలో జరిగింది అనంతరం ఆలయ సమీపం లో అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ మన్నే కృష్ణ బి రవీందర్ దాచ వీరేశం అమర్ సేటు బాదినేపల్లి శివ కుమార్ నక్క నరసింహులు డీలర్ సాయిలు బాలరాజు ముదిరాజ్ సంఘం సభ్యులు అధిక సంఖ్యలో లో మహిళలు పాల్గొన్నారు.