పయనించే సూర్యుడు జూన్ 3 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు. 13వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ టి. ఉషారాణి జాతీయ పతాక ఆవిష్కరణ నిర్వహించి, జాతీయ గీతంతో వందన సమర్పణ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లక్షలాదిమంది త్యాగ ఫలితమే తెలంగాణ ఆవిర్భావం జరిగిందని, తెలంగాణ సాధించుకున్నాక ఆరోగ్య ప్రగతి విశేషంగా జరుగుతుందని అన్నారు. దేశంలోనే తెలంగాణలో ఉన్న మెడికల్ సీట్లు ఏ రాష్ట్రంలో అందుబాటులో లేవని ఆమె అన్నారు.ఈ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు,నర్సింగ్ అధికారులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర సిబ్బంది ప్రతి ఒక్కరు తమ వంతు కర్తవ్యం గా ఆరోగ్య సేవలందిస్తూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు కావాలని సూచించారు. జిల్లాలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబ అభివృద్ధి,సామాజిక అభివృద్ధి తోడ్పాటు అవుతుందని అన్నారు.మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని,ప్రకృతి లో మార్పులతో జరిగే నూతన వ్యాధులను అరికట్టలో తెలంగాణ రాష్ట్ర వైద్యులు,ఆరోగ్య సిబ్బంది విశేష కృషి ఉన్నట్లు ఆమె తెలిపారు. ఆసుపత్రిలో సాధారణ చికిత్సల నుండి వెంటిలేటర్ చికిత్స వరకు ఉన్నతి అయిందని తెలిపారు. ప్రసవాలు, ఇతర శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని అన్నారు.వేడుకల్లో భాగంగా వైద్యులు పలువురు ప్రసంగించారు.సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ రవి శంకర్ రచించిన తెలంగాణ పాట పాడడంతో పలువురిని ఆకర్షించి అభినందించారు.ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపర్డెంట్ మంజుల, ఏ.డి.సి.జే. వసంత్ కుమార్, ఆర్.ఎం.ఓ వైద్యులు, డాక్టర్ రవి శంకర్,డాక్టర్ హనుమంత్ రావు,డాక్టర్ ప్రశాంత్ డాక్టర్ రోహిత్, కార్యాలయ సూపర్డెంట్ రామచంద్రయ్య, ఇతర వైద్యులు,ఆరోగ్య సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.