పయనించే సూర్యుడు న్యూస్ మే 26 బోధన్ : బోధన్ పట్టణ అధ్యక్షులుగా అంకు దాము నూతనంగా నియమించినందుకు ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు బోధన్ పట్టణ అధ్యక్షులుగా నాపై నమ్మకం ఉంచి నన్ను నియమించినందుకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగేష్ రెడ్డి పిసిసి డెలిగేట్ గంగా శంకర్ మాజీ బోధన్ పట్టణ అధ్యక్షులు పాషా మొయినిద్దీన్ బోధన్ మండల అధ్యక్షులు నాగేశ్వరరావు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు