ఘనంగా మహిళా వారోత్సవాలు

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మే 30 ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో మహిళా వారోత్సవాలు నిర్వహించారు. మెట్పల్లి పట్టణ మహిళా సంఘాలకు బ్యాంకు మేళ నిర్వహించి అర్హులైన మహిళా సంఘాల సభ్యులకు రెండు కోట్ల 9 లక్షల రూపాయల జంబో చెక్కు ప్రధానం చేయబడినది. ఈ కార్యక్రమంలో మెట్పల్లి బల్దియా చైర్పర్సన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ మహిళా సంఘ సభ్యులు బ్యాంక్ రుణాలు పొంది క్రమశిక్షణతో అట్టి రుణాలను చెల్లించి దిన దినము అభివృద్ధి చెందాలని మహిళలు ఆర్థిక సాధికారత సాధించినప్పుడే ఇంటిల్లిపాది అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారు ఇవే కాకుండా బ్యాంకు రుణాలు పొంది వారు ఎన్నుకున్న రంగాలలో వ్యాపారాలు విస్తరించి పలువురికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. వైస్ చైర్మన్ నవీన్ మాట్లాడుతూ బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని తెలియజేశారు మూడవ వార్డు కౌన్సిలర్ నరేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మహిళా సంఘ సభ్యులు మెప్మా ఆర్పి ల పైన ఉన్నదని తెలియజేశారు. శ్రీనిధి లోన్ల రికవరీలో రాష్ట్రస్థాయిలో రెండవసారి అవార్డు పొందిన పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బబ్బూరి లక్ష్మి, కార్యదర్శి చెరుకూరి పద్మ, అధికారి వాసుల సుజాత బల్దియా చైర్మన్ లింబాద్రి శాలువాల తో సన్మానించారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ వార్డు కౌన్సిలర్లు ,డిఎంసీ సునీత, టీఎంసీ జ్యోతి మహిళా సంఘ సభ్యులు రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.