ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

పయనించే సూర్యుడు, మే 22 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గురువారం వెల్దండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరి కిషన్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సందర్భంగా కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్నం భూపతిరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి మోతీలాల్ నాయక్ లు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. యువత అభివృద్ధి, సాంకేతిక రంగంలో దేశాన్ని ముందుకు నడిపించిన నాయకుడిగా రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాలూకా కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు పర్వత్ రెడ్డి, వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, సర్పంచ్ బద్రి తారా సింగ్, మండల ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఎర్ర శీను ముదిరాజ్, జిల్లా ఎస్సీ సెల్ సేవాదళ్ ఉపాధ్యక్షులు కొయ్యల పుల్లయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మట్ట భరత్ గౌడ్, యూత్ కాంగ్రెస్ వెల్దండ గ్రామ కమిటీ అధ్యక్షులు జంగిలి ఆనంద్ రాజ్, కాషారపు వెంకటయ్య, మట్ట నాగేశ్వర్ గౌడ్, గుద్దటి క్రిస్టల్, రఘుపతి నాయక్, ఎండి రషీద్, కొండల్, శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.