ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ 77 వ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ 9 జూలై 2026 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతదేశ రాజకీయాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల చరిత్రలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రస్థానం ఒక సువర్ణ అధ్యాయం. ఆయన ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలు లక్షలాది కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపాయని పేర్కొన్నారు. ఆయన భౌతికంగా మనకు దూరమైనప్పటికీ, ఆయన అందించిన పాలన, చూపిన ప్రజాదరణ నేటికీ సజీవంగా ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, ఉప సర్పంచ్ నిస్సార్, అక్బర్ నగర్ సర్పంచ్ రాంబాబు, ఓబీసీ జిల్లా కార్యదర్శి పట్ల సురేష్,మాజీ జెడ్పిటిసి నారోజి గంగారం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, నాయకులు పత్తి రాము, మాజీ ఎంపిటిసి షేక్ గౌస్, వడ్ల నరేష్, కర్క అశోక్,అడపా సాయిలు,ఇమ్రాన్ కురేషి,మొహమ్మద్ నజీర్,గాండ్ల శ్రీను, రజాక్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.