ఘనంగా మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

★ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఐఏఎస్ మధుసూదన్ నాయక్ ★ నగరంలో నీటి సమస్యపై ప్రత్యేక దృష్టి ★ పాల్గొన్న మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు

పయనించే సూర్యుడు జూన్ 03 మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళా శేఖర్: జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఐఏఎస్ అధికారి మధుసూదన్ నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం. గిరీష్, మేనేజర్ లక్ష్మన్న, శానిటేషన్ ఇన్స్పెక్టర్ నరేష్, ప్రజా ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ ప్రవీణ్ తో కలిసి నీటి సమస్యపై చర్చించారు. ఎండాకాలం దృష్ట్యా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన నిధుల సేకరణపై అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. నగరంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఈ సందర్భంగా సూచించారు.