పయనించే సూర్యుడు న్యూస్ :మే 28, తల్లాడ రిపోర్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు, జయంతి సందర్భంగా ఖమ్మం నగరంలోని సప్తపది ఫంక్షన్ హాల్ లో మహానాడు మొదటి రోజు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. టీడీపీ నాయకులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, కూరపాటి వెంకటేశ్వర్లు, కాపా కృష్ణమోహన్, కేతినేని హరీష్, వనమా వాసు, కొండబాల కర్ణాకర్, లు ముందుగా టిడిపి కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించారు, అనంతరం మహానాడు ప్రాంగణం బైపాస్ రోడ్డులో గల సప్తపది ఫంక్షన్ హాల్ కి చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరణ చేసి వారికి నివాళులర్పించి వర్చువల్ స్క్రీన్ పై మహానాడు కార్యక్రమం వీక్షించారు, అతిథులకు ఏర్పాటు చేసిన టీ, టిఫిన్, భోజనం, మజ్జిగ ప్యాకెట్లు, సాయంత్రం స్నాక్స్ అందజేసి మహానాడు పండుగను సంతోషంగా తొలి రోజు విజయవంతం చేశారు.
రేపటి వివరాల సమాచారం
మహానాడు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఉదయం 8 గంటలకు జిల్లా కార్యాలయం చేరుకుని అనంతరం కోలాటాల మధ్య పాదయాత్రతో ఎన్టీఆర్ సర్కిల్ లో వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి 9 గంటలకు రెండో రోజు మహానాడు ప్రాంగణం సప్తపది ఫంగ్షన్ హాల్ కి చేరుకుని వర్చువల్ (యల్ ఈ డి ) ద్వారా సభ వీక్షించడం జరుగును కావున అభిమానులు నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి హాజరై రెండవ రోజు మహానాడు విజయవంతం చేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో వడ్డేo విజయ్, మందడపు సుధాకర్, వాసిరెడ్డి భాస్కరరావు, మల్లెంపాటి అప్పారావు, శేఖర్ బాబు, గుత్తా సీతయ్య, తాత సుధాకర్, రావుట్ల సత్యనారాయణ, మీగడ రామారావు, రాజరాజేశ్వరి, మేకల సత్యవతి, చలసాని ఝాన్సీ, రాణి, తాడిశెట్టి స్వాతి, మందపల్లి రజిని. నల్లమల శ్రీను, దామా శ్రీను తదితరులు ఉన్నారు.