ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు: ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం

పయనించే సూర్యుడు, మే 21 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం జహీరాబాద్ పట్టణంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు, రోగుల సహాయకులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ మిత్రులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు రాజీవ్ గాంధీ అభిమానులు అందరూ భారీ సంఖ్యలో హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. కార్యక్రమ వివరాలు: స్థలం: ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి, జహీరాబాద్. సమయం: గురువారం మధ్యాహ్నం 12:00 గంటలకు.