పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి జూన్ 4 ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన మాజీ ఎమ్మెల్యే, సుప్రీంకోర్టు న్యాయవాది స్వర్గీయ కొమిరెడ్డి రాములు జయంతి ఉత్సవాలను స్థానిక విదిత్ రెడ్డి గార్డెన్, వెల్లుల్ల రోడ్ లో ఘనంగా నిర్వహించారు ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత నాయకుడు స్వర్గీయ కొమిరెడ్డి రాములు ఆశయాలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ రైసోద్దీన్, పట్టణ మాజీ అధ్యక్షుడు కుతుబోద్దీన్ పాషా కౌన్సిలర్లు కాజా అజీమోద్దీన్, మహమ్మద్ ముఖీం తదితరులు పాల్గొన్నారు