ఘనముగా సుందరయ్య వర్ధంతి

పయనించే సూర్యుడు న్యూస్ మే 20 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. సుందరయ్య ఆశయాలు కోసం కృషి చేద్దామని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. పేద ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41 వ వర్ధంతి సభ పలాస మండలం మాకన్నపల్లి, సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా మాకన్నపల్లిలో జరిగిన సభకు సిపిఎం నాయకులు టి అజయ్ కుమార్ అధ్యక్షత వహించారు.ఈ సభలో సిపిఎం నాయకులు యన్ గణపతి,మాకన్నపల్లి సర్పంచ్ సైని దేశయ్య, ప్రముఖ రచియిత కుత్తుమ్ వినోద్ కుమార్, మాజీ సైనిక ఉద్యోగులు సంఘం ప్రతినిధి కె లింగమూర్తి, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు ఆర్ చిన్నారావు, రాపాక ముసలయ్య, కుత్తుమ్ ధర్మారావు, తెప్పలరాజు, తదితరులు మాట్లాడుతూ నిరాడంబర జీవితం, నిస్వార్ధ సేవ కలిగిన పేద ప్రజలకె జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య అని కొనియాడారు. భూస్వామ్య కుటుంబం లో పుట్టి పేద, అనగారిన వర్గ ప్రజలు కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ దోపిడీ పద్ధతులు మార్చేసి పేదలను మరింత పేదలుగా చేస్తున్నారని అన్నారు. ఆకాశాన్ని అంటుతున్న ధరలు ఒకవైపు ఉపాది లేక మరో వైపు ప్రజలు అల్లాడుతున్నా ఏమీ పట్టనట్లు వ్యవహారిస్తున్న ఈ పాలకుల కుటిల నీతిని ప్రజలు ప్రశ్నించాలని,బలమైన ప్రజా పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు.. పీడిత ప్రజల అభ్యున్నతి కోసం పాటు పడడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళులని అన్నారు.ఈ కార్యక్రమంలో బత్తిని ప్రసాధరావు, దుర్గరావు, సైని జాన్సీ, తెప్పల మోహిని, బొకర మిస్సమ్మ, జుత్తు లోకానాదం తెప్పల షణ్ముఖ,కళాకారులు ఆర్ చిరంజీవులు, పి జోగారావు డి లక్ష్మణ, యన్ ఢిల్లేశ్వరి, యం లావణ్య, జె భాగ్యలక్ష్మి, రజని,జి జ్యోతి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు