పయనించే సూర్యుడు-04-07-2026-రాజంపేట న్యూస్ : జమ్మలమడుగు పర్యటనలో భాగంగా విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్ మోహన్ రాజు హెలిప్యాడ్ వద్దకు చేరుకుని సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజంపేట నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, తాజా రాజకీయ పరిణామాలు గురించి చర్చించినట్లు జగన్ మోహన్ రాజు తెలియజేశారు.