చట్టి గ్రామపంచాయతీ పరిధిలో జనజాతీయ గరిమ ఉత్సవ్ – జన భాగీదారి అభియాన్ వారోత్సవాలు నిర్వహణ:

పయనించే సూర్యుడు మే 21 పోలవరం జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామపంచాయతీ పరిధిలో గల సంఘం ఆఫీసు సమీపాన ఉపాధి శ్రామికుల ద్వారా జరిగే చెరువు త్రవ్వకం జరిగే ప్రదేశం వద్ద జనజాతీయ గరిమ ఉత్సవ్ - జన భాగీదారి అభియాన్ వారోత్సవాలలో భాగంగా మెడికల్ క్యాంప్ మరియు అవగాహనా సభ నిర్వహించుట జరిగింది. ఈ కార్యక్రమంలో చట్టి గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి మహ్మద్ ఆలీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామస్థాయిలో అమలవుతున్న అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించి అవగాహన కల్పించారు, ఈ సందర్భంగా గ్రామస్థాయిలో ఇంకా అర్హులైనవారికి సంక్షేమ పథకాలు అమలు కానట్లయితే వారి వివరాలను తెలియజేయాలని పేర్కొన్నారు. పెసా కమిటీ, ఉపాద్యక్షులు తుర్రం చిన ముత్తయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న విద్య ,వైద్య సదుపాయాలను అందిపుచ్చుకొని తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని తెలియజేశారు. చట్టిగ్రామ పెసా కమిటీ కార్యదర్శి పొడియం రామకృష్ణ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హక్కులను అవకాశాలను కల్పించిందని వాటిని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు సద్వినియోగపరుచుకోవాలని తమ హక్కుల పరిరక్షణకు గ్రామసభల ద్వారా మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలని తెలియజేశారు. వైద్య సిబ్బంది ద్వారా ఉపాధి శ్రామికులకు మెడికల్ చెకప్ చేసారు మరియు ఓ ఆర్ఎస్ ప్యాకెట్లు, టాబ్లెట్లు పంపిణీ చేసారు ఈ కార్యక్రమం లో సచివాలయం సిబ్బంది, ఆశ, మరియు గ్రామ పెద్దలు, ఉపాధి శ్రామికులు, ఉపాధి మేట్లు పాల్గొన్నారు.